Crime News

Triple Murder: ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్‌.. నిందితుడు చిన్న కుమారుడే!

Triple Murder: ఢిల్లీలోని మైదాన్‌గడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించిన వార్త నిజమే. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను కనుగొన్నారు . మృతులను రజనీ సింగ్ (45), ప్రేమ్ సింగ్ (50), మరియు రితిక్ (24) గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.

హత్య జరిగినప్పటి నుండి కుటుంబంలో రెండవ కుమారుడు సిద్ధార్థ్ ఇంటి నుండి కనిపించకుండా పోయాడని ప్రాథమిక విచారణలో తేలింది. స్థానిక విచారణలో సిద్ధార్థ్ మానసిక చికిత్స పొందుతున్నట్లు కూడా తేలింది. అదృశ్యమయ్యే ముందు తన కుటుంబాన్ని మొత్తం చంపేశానని సిద్ధార్థ్ ఎవరికైనా చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Ramesh Tawadkar: బిగ్ బ్రేకింగ్.. గోవా అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌ తవాడ్కర్‌ రాజీనామా

ఇంటిని సీజ్ చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపారు. సంఘటనా స్థలంలో ఉన్న ఫోరెన్సిక్ బృందాలు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నాయి. సిద్ధార్థ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. సిద్ధార్థ్‌మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తిస్తుంటాడని స్థానికులు తెలిపారు. దీంతో సిద్ధార్థ్‌కు పన్నెండేళ్లుగా మానసిక చికిత్స చేయిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు వివరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Car Accident: కొత్త కారు కొన్న సంబురం.. క్ష‌ణాల్లో ఆవిరి.. ఓఆర్ఆర్‌పై కారులోనే ముగ్గురు స్నేహితుల స‌జీవ‌ద‌హ‌నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *