Mumbai Indians: టార్గెట్ తక్కువే.. 156 రన్స్ చేస్తే విన్. కానీ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై దీన్ని చేధించడం కష్టమే. మంగళవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. కానీ వర్షంతో మ్యాచ్ ఫలితం మలుపులు తిరిగి చివరికి గుజరాత్‌ను గెలుపు వరించింది. అయితే ముంబై ఓడిపోవడానికి కారణం మూడు ఓవర్లే కారణమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
తొలుత ముంబై బౌలర్లు బౌల్ట్, బుమ్రా, దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ కేవలం 29 పరుగులే చేసింది. ఆ తర్వాత 7వ ఓవర్‌లో దీపక్ చాహర్ 11 రన్స్ ఇవ్వడంతో గుజరాత్ స్కోర్ 40కి చేరింది. ఇక 8వ ఓవర్ వేసిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య సుదీర్ఘమైన ఓవర్ వేశాడని చెప్పొచ్చు. మొదటి 3 బాల్స్‌కు 6 రన్స్ ఇచ్చిన పాండ్య.. తర్వాత ఒక సిక్స్, రెండు నోబాల్స్, మూడు వైడ్లతో కలిపి ఆ ఓవర్‌లో ఏకంగా 18 రన్స్ ఇచ్చాడు. ఇదే గుజరాత్ ఇన్నింగ్స్‌కు ఊపిరిపోసింది. డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం 8 ఓవర్లకు 53/1 ఉంటే చాలు. కానీ గుజరాత్ అప్పటికే 58/1 స్కోరు సాధించింది.
Mumbai Indians: ఆ తర్వాత ముంబై బౌలర్లు మళ్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. కీలకమైన జాస్ బట్లర్‌ను అశ్విని కుమార్ ఔట్ చేశాడు. ఈ సమయంలో వర్షంతో మ్యాచ్ రద్దైతే ముంబై గెలిచేది. ఎందుకంటే అప్పటికి గుజరాత్ స్కోరు 12 ఓవర్లకు 79/2గా ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దైతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 84 పరుగులు చేసి ఉండాలి. కానీ అప్పటికీ గుజరాత్ అనుకున్నదానికి 5రన్స్ తక్కువ చేసింది. అయితే 13ఓవర్‌లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్ వరుసగా రెండు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
Also Read: IPL 2025: IPL నుండి మూడు జట్లు ఔట్..
ఇక 19వ ఓవర్ వేసే సమయంలో మళ్లీ వర్షం వచ్చింది. అప్పటికే గుజరాత్ అనుకున్నదానకంటే 5రన్స్ వెనకబడి ఉంది. కానీ మళ్లీ ముంబైకి కలిసిరాలేదు. వర్షం తగ్గడంతో 19 ఓవర్లకు 147 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించారు. అంటే 6 బంతుల్లో 15 పరుగులు చేయాలి. అప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఓ ఫీల్డర్‌ను ఇన్నర్ రింగ్‌లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తొలి మూడు బంతుల్లోనే సిక్స్, ఫోర్ సహా 11 పరుగులను గుజరాత్ బ్యాటర్లు రాబట్టారు. ఇక చివరి బాల్‌కు
రనౌట్ చేసే అవకాశం చేజారడంతో గుజరాత్‌ను గెలపు వరించింది.