Revanth Cabinet Expansion

Revanth Cabinet Expansion: రాజ్ భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

Revanth Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించేసింది. సామాజిక న్యాయానికి ప్రాముఖ్యత ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు కొత్త మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), వాకిటి శ్రీహరి (మక్తల్)లు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ విస్తరణలో ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం గమనార్హం. దీనివల్ల కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. కాంగ్రెస్ గెలుచుకున్న ఏడు బీసీ ఎమ్మెల్యేలలో ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి. ఇది కాంగ్రెస్ పాలనలో సామాజిక సమీకరణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

ఇది కూడా చదవండి: KCR: మాగంటి భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్

ఇక శాసన సభ ఉప సభాపతి పదవికి తొలిసారిగా డోర్నకల్ నుంచి గెలిచిన రామచంద్రునాయక్‌ను నియమించారు. ఆయన ఎస్టీ లంబాడా వర్గానికి చెందినవారు. ఈ మేరకు ఎస్టీ ఆదివాసీలకు ఇప్పటికే మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు మరో కీలక పదవి లభించడమే విశేషం. అయితే ఈసారి విస్తరణలో రెడ్డి వర్గానికి మాత్రం ఎలాంటి ప్రాతినిధ్యం లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొత్తంగా ఈ కేబినెట్ విస్తరణ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం, సమతుల్యత దిశగా మరో అడుగు వేశారు. పార్టీ అధిష్టానం కూడా ఈసారి ఎస్సీ, బీసీ, ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నైక సుదర్శన్ రెడ్డి వంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా తాత్కాలికంగా వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cinnamon Benefits: దాల్చిన చెక్కతో అద్భుత ప్రయోజనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *