google

Google: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కట్టలేనంత భారీ జరిమానా..

Google: టెక్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. తమ దేశ యూట్యూబ్‌ ఛానల్స్‌పై నిషేధం విధించినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్‌ రష్యన్‌ రూబుళ్ల (2.5 డెసిలియన్‌ అమెరికా డాలర్లు) భారీ జరిమానా వేశారు. అంటే భూమిపై చలామణీలో ఉన్న డబ్బు కంటే ఎక్కువన్న మాట. ఒక అన్‌డెసిలియన్‌ అంటే 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: DA Hike: ఉద్యోగులకు పంజాబ్ ప్రభుత్వ భారీ కానుక

Google: 2.5 అన్‌డెసలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. 2020 నుంచి ఇప్పటివరకు క్రెమ్లిన్‌ అనుకూల, రష్యా ప్రభుత్వ అధికార మీడియాతో పాటు మొత్తం 17 ఛానల్స్‌ను యూట్యూబ్‌ నిలిపివేసింది. ఈ ఛానల్స్‌ను పునరుద్ధరించాలని మాస్కో కోర్టు గూగుల్‌‌ని ఆదేశించింది. గూగుల్ ఆ ఆదేశాలను నిరాకరించింది. దీంతో మాస్కో కోర్టు గూగుల్‌కు అతి భారీ జరిమానా విధించింది. ఇది ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్‌ డాలర్ల కంటే కూడా ఎక్కువ ఉండడం గమనార్మం.అయితే ఇంత పెద్ద మొత్తంలో ఫైన్‌ కట్టడం గూగుల్‌కు  కూడా సాధ్యం కాకపోవచ్చు.

ఇది కూడా చదవండి: Farooq Abdullah: దేశంలోకి చొరబడితే ఎన్‌కౌంటర్లు తప్పవు.. ఫరూక్ అబ్దుల్లా వార్నింగ్

Google: అయితే గూగుల్ రష్యన్‌ కోర్టులు ఇచ్చే తీర్పులు  తమ కంపెనీ పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికోసం రష్యన్‌ టీవీ ఛానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్‌ కోర్టుల్లో వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ కేసులో రష్యా కోర్టు తాము ఉత్తర్వులు జారీచేసినా స్పందించకపోవడంతో అదే తేదీ నుంచి రోజుకు 1,00,000 రష్యన్ రూబిళ్లతో ఈ ఫైన్ ప్రతి వారం డబుల్ అవుతుంది అని తెలిపారు. గూగుల్ అల్ఫాబెట్ గతేడాది వార్షిక ఆదాయమే 307 బిలియన్ డాలర్లు. కానీ, రష్యా కోర్టు వేసిన ఫైన్‌లో అది 0.05 శాతం కూడా ఉండదు. ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టడం గూగుల్​కు ఇదేం మొదటిసారి కాదు. ఇంత పెద్ద మొత్తం కట్టడం ప్రపంచంలో ఉన్న ఏ సమస్తకి సాధ్యం కాదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ లో ముంబై రాక్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *