Tejaswi Madivada: తెలుగు నటి తేజస్వి మదివాడ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ‘కేరింత’ సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ భామ, తన అద్భుత నటనతో పాటు గ్లామర్‌తోనూ ఆకట్టుకుంటోంది. అయితే, ఆమె ఎక్కువగా బోల్డ్ పాత్రల్లో కనిపించడంతో అలాంటి అవకాశాలే ఎక్కువగా వచ్చాయి. హర్రర్ జోనర్‌లోనూ తన ప్రతిభను చాటినప్పటికీ, పెద్ద హీరోల సినిమాల్లో ఆమెకు ఇంకా పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తేజస్వి ఎప్పటికప్పుడు తన అందంతో హోరెత్తిస్తోంది. తాజాగా మెరూన్ రంగు బికినీలో స్విమ్మింగ్ పూల్ వద్ద తన అందచందాలను ఆవిష్కరించింది. ఈ ఫొటోల్లో ఆమె స్టైల్, ఆకర్షణ అభిమానులను కట్టిపడేస్తోంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తేజస్వి గతంలో కూడా ఇలాంటి గ్లామరస్ లుక్‌లతో దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఈసారి ఆమె లుక్ మరింత ప్రత్యేకమైందని నెటిజన్లు కొనియాడుతున్నారు. సినిమా అవకాశాల కంటే సోషల్ మీడియాలోనే ఆమె ఎక్కువగా హైలైట్ అవుతుండటం గమనార్హం. తేజస్వి తన కెరీర్‌లో ఇకపై ఎలాంటి పాత్రలతో ఆకట్టుకుంటుందో చూడాలి.
View this post on Instagram