CM Vijay

CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిబంధనలు సవరిస్తూ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.75,000 వరకు అప్పు ఉన్న సన్న, చిన్న, పెద్ద రైతులకు పూర్తి రుణమాఫీ చేయనుండగా.. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.35,000 చొప్పున మాఫీ చేయనున్నారు. రైతుల నిరసనలతో సచివాలయంలో జరిగిన సమీక్షలో ఈ మార్పులు చేశారు. దీనివల్ల 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వంపై రూ.5,932 కోట్ల అదనపు భారం పడనుంది.

మరింత CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!
NEET Re-Exam

NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు

NEET Re-Exam: ఈ నెల 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే జూన్ 30 వరకు టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్‌ను కూడా తొలగించింది. మరోవైపు ఎన్టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచింది. పేపర్ లీక్ అవ్వకుండా ఉండేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రశ్నాపత్రాల తరలింపునకు విమానాలను ఉపయోగించారు.

మరింత NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు
Abhijit Deepak

Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!

Abhijit Deepak: జైపూర్‌లో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు చెంపదెబ్బ కొట్టి దాడి చేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు దాడి చేసిన వారిని పట్టుకుని చితకబాదారు. సుప్రీంకోర్టు జడ్జి యువతను బొద్దింకలతో పోల్చిన వ్యాఖ్యల బ్యాక్‌డ్రాప్‌లో పుట్టిన ఈ పార్టీ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్త ఆందోళనలు చేస్తోంది.

మరింత Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!
Bhopal:

Bhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!

Bhopal: మధ్యప్రదేశ్ ఏటీఎస్ భోపాల్‌లో మహమ్మద్ ఫరాజ్ అనే యువకుడిని ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేసింది. అతని మొబైల్ నుండి పాకిస్తాన్ పంపిన ఉగ్రవాద డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణకు సిద్ధమవుతున్న ఈ నిందితుడు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని, అతని విదేశీ కనెక్షన్లపై ఏటీఎస్ అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారని సమాచారం.

మరింత Bhopal: పాకిస్తాన్‌తో సంబంధాలున్న యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద కంటెంట్ ప్రచారం!
IRCTC New Website

IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!

IRCTC New Website: ఐఆర్‌సీటీసీ తత్కాల్ సాంకేతిక సమస్యలపై జైపూర్ విద్యార్థుల ఫిర్యాదుతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ జూలై 15 నాటికి కొత్త వెబ్‌సైట్ తేవాలని ఆదేశించారు. కొత్త సైట్ వచ్చే లోపు ప్రయాణికులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను భద్రపరుచుకోవాలని, జూలై 15 పరిసరాల్లో జర్నీలు ఉంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!
Jaishankar:

Jaishankar: మీ ఆయుధాలు భారత్‌పై దాడికి వాడారు.. రష్యా ఆయిల్ కొనుగోలుపై మాకు నీతులు చెప్పొద్దు!

Jaishankar: రష్యా నుండి ఆయిల్ కొనడాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించారు. ఆయిల్ మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా ఆయిల్ కొనమని 2022లో అమెరికానే భారత్‌ను కోరిందని చెప్పారు. యూరప్ దేశాల ఆయుధాలు పాకిస్తాన్ చేతికి చిక్కి భారత్‌పై దాడులకు (ఉదాహరణకు 1971లో ఐఎన్ఎస్ ఖుక్రీ నౌకను ముంచడం) ఉపయోగపడ్డాయని గుర్తు చేస్తూ.. భారత్‌ను విమర్శించే హక్కు పాశ్చాత్య దేశాలకు లేదని జైశంకర్ తేల్చిచెప్పారు.

మరింత Jaishankar: మీ ఆయుధాలు భారత్‌పై దాడికి వాడారు.. రష్యా ఆయిల్ కొనుగోలుపై మాకు నీతులు చెప్పొద్దు!
Meenakshi Natarajan:

Meenakshi Natarajan: ఎన్నికల సంఘం తీరుపై నమ్మకం లేదు.. సుప్రీంపై మాట్లాడను

Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఎన్నికల తర్వాత ‘ఎన్నికల పిటిషన్’ వేసుకోవడమే మార్గమని స్పష్టం చేసింది. ఫామ్ 26 లో ప్రైవేట్ కేసు దాచారనే కారణంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురికాగా, తాను ఏ సమాచారమూ దాచలేదని నటరాజన్ స్పష్టం చేస్తూ.. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు.

మరింత Meenakshi Natarajan: ఎన్నికల సంఘం తీరుపై నమ్మకం లేదు.. సుప్రీంపై మాట్లాడను
Attacks Must End:

Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!

Attacks Must End: ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడుల వల్ల నౌకల్లో ఉన్న ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, పలువురిని రక్షించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. పశ్చిమ ఆసియాలో దాడులు ఆపి చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో 18 వేల మందికి పైగా భారతీయ నావికులు ఉన్నందున వారి భద్రతపై కేంద్రం నిరంతర నిఘా ఉంచింది.

మరింత Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!
Meenakshi Natarajan:

Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో బీజేపీ అభ్యర్థులు Meenakshi Natarajan: తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అన్యాయంపై రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

మరింత Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!
Congress-TMC Merge

Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?

Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?

మరింత Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?