F414 Engine: భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. తన స్వంత ఐదవ తరం (5th Generation) అత్యాధునిక స్టీల్త్ యుద్ధ విమానం ‘ఏఎమ్‌సీఏ’ (AMCA – Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టుపై దేశం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది.
మరింత F414 Engine: భారత కొత్త యుద్ధ విమానానికి ఇంజిన్ కష్టం.. భారీగా ధరలు పెంచిన అమెరికా కంపెనీ!Tag: National News
Jewellery Heist: బంజారాహిల్స్ జ్యువెలరీ షోరూమ్‌లో కత్తితో రౌడీషీటర్ల వీరంగం..!
Jewellery Heist: హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బంజారాహిల్స్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒక జ్యువెలరీ షోరూమ్‌లోకి చొరబడిన ఇద్దరు రౌడీషీటర్లు కత్తితో సిబ్బందిని హడలెత్తించి, వీరంగం సృష్టించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరింత Jewellery Heist: బంజారాహిల్స్ జ్యువెలరీ షోరూమ్‌లో కత్తితో రౌడీషీటర్ల వీరంగం..!Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం
Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 66 మంది పురస్కారాలు అందుకున్నారు. జస్టిస్ కేటీ థామస్ (పద్మవిభూషణ్), డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టి (పద్మభూషణ్)లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు చంద్రమౌళి, తంగరాజ్, క్రికెటర్ రోహిత్ శర్మలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.
మరింత Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానంSupreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
Supreme Court: హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే జడ్జిల నియామక నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకంటే జూనియర్లకు ప్రమోషన్ ఇచ్చారని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జడ్జి అరవింద్ మల్హోత్రా వేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం సీనియారిటీ వల్లే పదోన్నతి హక్కుగా మారదని, కొలీజియం నిర్ణయమే ఫైనల్ అని కోర్టు తేల్చిచెప్పింది.
మరింత Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!George Kurian Resigns: కేంద్ర మంత్రి జార్జి కురియన్ హఠాత్తుగా రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. కారణాలపై వీడని సస్పెన్స్!
George Kurian Resigns: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జార్జి కురియన్ మంగళవారం (జూన్ 23, 2026) నాడు తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేరళకు చెందిన ఈ సీనియర్ బీజేపీ నేత రాజీనామా చేయడానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. అయితే కేరళలో పార్టీ బలోపేతం కోసం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరింత George Kurian Resigns: కేంద్ర మంత్రి జార్జి కురియన్ హఠాత్తుగా రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. కారణాలపై వీడని సస్పెన్స్!NEET-UG Retest: శంకర్ దాదా MBBS స్టైల్‌లో చీటింగ్.. దొరికిపోయిన 24 మంది..!
NEET-UG Retest: బీహార్ లఖిసరాయ్‌లో నీట్-యూజీ రీ-టెస్ట్ సందర్భంగా మరొకరి స్థానంలో పరీక్షలు రాసే ‘సాల్వర్ గ్యాంగ్’ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎయిమ్స్, బీహెచ్‌యూ, పీఎమ్‌సీహెచ్ మెడికల్ మరియు నర్సింగ్ విద్యార్థులతో పాటు బయోమెట్రిక్ కంపెనీ సిబ్బంది కలిపి మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. పాత నీట్ కేసు నిందితుడు అర్పిత్ రాజ్ దీనికి మాస్టర్‌మైండ్‌గా తేలాడు. అనారోగ్యం నెపంతో కాలేజీ నుండి తప్పించుకుని మయాంక్ కశ్యప్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ నకిలీ బయోమెట్రిక్ ఆఫీసర్‌గా వచ్చి పట్టుబడటంతో ఈ స్కామ్ బయటపడింది.
మరింత NEET-UG Retest: శంకర్ దాదా MBBS స్టైల్‌లో చీటింగ్.. దొరికిపోయిన 24 మంది..!IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!
IUML: తమిళనాడు రాజకీయాల్లో 1962 నుండి డీఎంకే కూటమిలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఆ కూటమికి గుడ్ బై చెప్పి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపింది. డీఎంకే స్థానిక నేతల పెత్తనం, సీట్ల కేటాయింపులో అసంతృప్తి దీనికి కారణం కాగా.. ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ ఇప్పటికే టీవీకే కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ తెలిపారు.
మరింత IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
Delhi High Court: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ తేజస్ కారియా స్పష్టం చేశారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలకు టెలిగ్రామ్ డార్క్ వెబ్‌లా మారుతోందన్న కేంద్రం వాదనతో కోర్టు ఏకీభవించింది.
మరింత Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టుTelegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!
Telegram: టెలిగ్రామ్ యాప్ ఒక “కొత్త డార్క్ వెబ్” గా మారిందని, నేరస్థులు, ఉగ్రవాదులు చట్టాల నుండి తప్పించుకోవడానికి దీనిని వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఒకే అకౌంట్‌తో 40 బోట్లను సృష్టించే వీలుండటం వల్ల సైబర్ మోసాలు, ఆధార్ వంటి పౌరుల వ్యక్తిగత డేటా లీక్‌లు, పైరసీ, డ్రగ్స్ స్మగ్లింగ్ వేగంగా విస్తరిస్తున్నాయని ఐ4సి నివేదికలను ఉటంకిస్తూ కేంద్రం తన నిషేధ నిర్ణయాన్ని సమర్థించుకుంది.
మరింత Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!
Mumbai: ముంబైలో ఈ ఏడాది వర్షాకాలం ఆలస్యమవడంతో నీటి ముప్పు పొంచి ఉంది. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో కేవలం 10.72 శాతం నీరు మాత్రమే ఉంది. ఈ నీటి నిల్వలు మరో 40 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. జూన్ 20 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరింత Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!