Supreme Court: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సుప్రీంకోర్టులో వచ్చే ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడింది. వాస్తవంగా ఈ రోజు విచారణ ఉండగా, ప్రతివాదులు కౌంటర్ల దాఖలుకు మరింత సమయం కోరారు. దీంతో ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ప్రతివాదులను ప్రశ్నించింది. కాలయాపన చేసే విధానాలను మానుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
Supreme Court: బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ తరఫున శేషాద్రినాయుడు, కౌశిక్‌రెడ్డి తరఫున ఆర్యమా సుందరం తమ వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులపై తొలుత 2024 మార్చి 18న స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఏకంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారని వివరించారు. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారని, ఇప్పుడు ఎమ్మల్యేగా కొనసాగుతున్నారని కోర్టుకు వివరించారు.
Supreme Court: సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 2వ తేదీకి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణ సమయంలో ప్రతివాదులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉన్నది. ఆ తర్వాతే తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.