shalini : ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యంగ్ యాక్ట్రెస్ షాలిని పాండే, ఆ సినిమా తరువాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’, ‘ఎన్.టి.ఆర్’, ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ వంటి సినిమాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటింది. అయినా ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో, కొంతకాలం తెలుగు చిత్రసీమకు విరామమిచ్చి బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ బాధాకర అనుభవాన్ని పంచుకుంది. “ఒకసారి నేను వ్యానిటీ వ్యాన్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో, ఒక ప్రముఖ దర్శకుడు నా అనుమతి లేకుండానే లోపలికి వచ్చాడు. అప్పుడు అతను నన్ను న్యూడ్‌గా చూశాడు. కానీ అప్పట్లో భయంతో నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత ఇది ఇండస్ట్రీలో సాధారణమే అన్నట్టు నేను చూసాను” అని ఆమె చెప్పింది.
తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె చాలా ధైర్యంగా చెప్పింది. అయితే, ఆ దర్శకుడి పేరు, సినిమా వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.