Bunny Vasu

Bunny Vasu: థియేటర్లను కాపాడండి అంటూ టాలీవుడ్‌కు బన్నీ వాసు సూచనలు!

Bunny Vasu: ప్రముఖ నిర్మాత బన్నీ వాసు థియేటర్లను కాపాడాలంటూ స్టార్ హీరోలు, నిర్మాతలకు కీలక సూచనలు చేశారు. సినిమా విడుదలై 28 రోజుల్లోనే ఓటీటీలోకి వెళ్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడతాయని హెచ్చరించారు. “పర్సంటేజ్ గొడవల కంటే, ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి తీసుకొచ్చేలా ఆలోచించాలి. అర్ధరూపాయి వ్యాపారంలో పావలా కోసం పోట్లాడితే రూపాయి వ్యాపారం దెబ్బతింటుంది,” అని ఆయన పేర్కొన్నారు. స్టార్ హీరోలు రెండు-మూడేళ్లకు ఒక్క సినిమా చేస్తే థియేటర్లు నష్టపోయి, ప్రేక్షకులు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీప్లెక్స్‌లలో నిర్మాతలకు కేవలం 43% ఆదాయమే వస్తుందని, సింగిల్ స్క్రీన్‌లు మూతపడితే ఇండస్ట్రీకి నష్టమని తెలిపారు. బన్నీ వాసు సూచనలు నిజంగా ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పటికైనా హీరోలు, మేకర్స్ ఆకర్షణీయ కంటెంట్‌పై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సలహాలతో టాలీవుడ్‌లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవడంతో 50వేల కోట్ల నష్టం.. వెల్లడించిన మంత్రి నిమ్మలరామానాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *