Global Warming: ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ గ్లోబల్ వార్మింగ్‌పై పరిశోధన చేసింది, ఇందులో భారత్ తో పాటు , మొత్తం ఆసియాకు ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. 2070 నాటికి 30 కోట్ల మంది ప్రజల భూమి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఈ రిపోర్ట్ చెబుతోంది.
రిపోర్ట్ ప్రకారం, కార్బన్ ఉద్గారాలు ఇలాగే పెరుగుతూ ఉంటే, 2070 నాటికి ఆసియా – పసిఫిక్ ప్రాంత ఆర్థిక వృద్ధి 16.9 శాతం తగ్గవచ్చు. భారతదేశ జిడిపి 24.7 శాతం తగ్గుతుందని అంచనా.
ఇది కూడా చదవండి: Narendra Modi: వరుసగా 11వ సారి సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
సముద్ర మట్టాలు పెరగడంతో పాటు పని సామర్థ్యం తగ్గిపోవడం వల్ల తక్కువ-ఆదాయ ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా నష్టపోతాయని రిపోర్ట్ చెబుతోంది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ – ఆసియా-పసిఫిక్ క్లైమేట్ రిపోర్ట్ ఈ ప్రాంతంపై హానికరమైన ప్రభావాల గురించి సమాచారాన్ని అందించింది.
వాతావరణ సంక్షోభం తీవ్రమైతే, 30 కోట్ల మంది తీరప్రాంత వరదలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. తీరప్రాంత ఆస్తులు 2070 నాటికి బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూడవచ్చని ఆ రిపోర్ట్ చెబుతోంది.