Sanya Malhotra

Sanya Malhotra: ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారిన సాన్యా మల్హోత్రా!

Sanya Malhotra: మిసెస్.. ప్రస్తుతం బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఓటీటీ మూవీ. ఎక్కడా చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో ఫీమేల్ లీడ్‌లో యాక్ట్ చేసిన సాన్యా మల్హోత్రా టాక్ ఆఫ్ ది బీటౌన్‌గా మారింది. ఆమె నటనకు ఫిదా అవుతున్నారు ఆడియన్స్. సాన్యా గతంలో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ.. ఇది ఆమెకు స్పెషల్ మూవీగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దంగల్ మూవీలో బబిత కుమారీగా నటించిన సాన్యా.. కెరీర్ స్టార్టింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. బడాయి హో, శకుంతల దేవీ, లూడోలో స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆ తరువాత పాగలైత్‌తో ఫీమేల్ లీడ్‌లోకి ఛేంజైన భామ.. కాథల్‌తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అక్కడ నుండి టాప్ హీరోలతో జోడీ కడుతోంది భామ. శ్యామ్ బహుదూర్‌లో విక్కీ కౌశల్ భార్యగా, షారూఖ్ జవాన్‌లో కీ రోల్ చేసింది బ్యూటీ. కానీ ‘మిసెస్’ ఆమె ఇమేజ్ ని డబుల్ చేసింది. ఇక ‘మిసెస్’ ఇచ్చిన సక్సెస్ తో ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకెళుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Aravind: అల్లు సెంటిమెంట్ తో అలా చేశారా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *