Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దక్షిణాదిలో దుమ్ము రేపింది. ఏడాదికి మూడుచార సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చేది. కానీ విడాకుల తర్వాత, ముఖ్యంగా మయాసైటిస్ అనే వ్యాధి సోకిన తర్వాత ఆమె కెరీర్‌లో భారీ మార్పు వచ్చింది. శరీరం బలహీనపడడంతో ఒకేసారి పలు సినిమాలు చేయడం మానేసి, క్రమంగా తక్కువ ప్రాజెక్ట్‌లతో ముందుకు సాగుతోంది.
ఆరోగ్యం ముందే ముఖ్యం అంటున్న సమంత
ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ – “ఇకపై ఒకేసారి నాలుగు, ఐదు సినిమాలు చేయను. నా శరీరం చెబితేనే ప్రాజెక్ట్‌లను అంగీకరిస్తాను. నాకు ఇప్పుడు ఆరోగ్యమే ముఖ్యం. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే మంచి పనిని చేయగలం. అందుకే వర్క్‌లోడ్ తగ్గించుకున్నాను” అని స్పష్టం చేసింది.
అలాగే సినిమాల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత మాత్రం తగ్గదని, తాను చేసే ప్రతి సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రేక్షకుల మనసుకు దగ్గరగా ఉండేలా చూసుకుంటానని తెలిపింది.
ఇది కూడా చదవండి: Malayalam Actress: హోటల్‌కి రమ్మన్నాడు.. యువ కాంగ్రెస్ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
సంఖ్య కాదు.. నాణ్యతే ముఖ్యం
ప్రసిద్ధ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సమంత ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. “ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎలాంటి మంచి సినిమాలు చేశామన్నది ముఖ్యం. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా కేవలం ఫ్యాషన్ కోసం, గుర్తింపు కోసం కాదు. నా మనసుకు దగ్గరైన కథలకే నేను అవును చెబుతాను” అని చెప్పింది.
నిర్మాతగా కూడా అడుగులు
హీరోయిన్‌గానే కాకుండా సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది. తన సొంత ట్రాలాల బ్యానర్ ద్వారా యంగ్ టాలెంట్‌కి అవకాశం ఇస్తూ కొత్త తరహా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇటీవలే ఆమె నిర్మించిన ‘శుభం’ చిత్రం మంచి విజయం సాధించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్
సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం సమంత యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫోటోషూట్లు, ఫిట్‌నెస్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
రాబోయే సినిమాలు
ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు, మరో రెండు ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది. అలాగే రామ్‌చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్‌లో కూడా కనిపించబోతోందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ‘ఖుషీ’ (2023) తర్వాత సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో కనిపించింది.