Egg vs Panner

Egg vs Panner: గుడ్లు, పన్నీర్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Egg vs Panner: శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. శరీర నిర్మాణానికి ప్రోటన్లు ఎంతో అవసరం. మన ఆహారంలో సరైన రకమైన ప్రోటీన్‌ను ఎంచుకోవడం మన బాధ్యత. పనీర్, గుడ్డు అధిక ప్రోటీన్లను కలిగివుంటాయి. అయితే వీటిలో ఏది బెస్ట్ ప్రోటీన్‌ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పన్నీర్ లాభాలు :
100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పనీర్ లేదా భారతీయ కాటేజ్ చీజ్ విస్తృతంగా ఇష్టపడే శాఖాహారం. ఇది పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆమ్ల ఏజెంట్‌ను కలపడం వల్ల తయారవుతుంది. పనీర్‌లో ప్రోటీన్, కాల్షియంతో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

శాకాహారులు, హై-ప్రోటీన్ డైట్ కోసం చూస్తున్న వారికి పనీర్ అద్భుతమైన ఎంపిక. నెమ్మదిగా జీర్ణమయ్యే కేసైన్ ప్రోటీన్ కండరాల పునరుద్ధరణ, పెరుగుదలకు మంచిది. పనీర్‌లో కొవ్వు అధికంగా ఉంటుంది. 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇది కాల్షియం యొక్క మంచి మూలం. ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది.

గడ్డు లాభాలు :
100 గ్రాముల ఉడికించిన గుడ్డులో 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్లు మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. తక్కువ కొవ్వు లేదా కేలరీలతో ప్రోటీన్ యొక్క లీన్ సోర్స్ కోసం చూస్తున్న వారికి ఉడికించిన గుడ్లు గొప్ప ఎంపిక. ఉడికించిన గుడ్లలో 10 గ్రాముల కొవ్వు, 1 గ్రాము కంటే తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వాటిలో విటమిన్ డి, విటమిన్ బి12, సెలీనియం, కోలిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, జీవక్రియకు తోడ్పడతాయి.

ఆమ్లెట్..
100 గ్రాముల ఆమ్లెట్‌లో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్లకు కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి పదార్థాలను యాడ్ చేసి ద్వారా ఆమ్లెట్ తయారు చేస్తారు. ఈ ఆమ్లెట్ యొక్క ప్రోటీన్ కంటెంట్ రెసిపీని బట్టి మారవచ్చు. ఆమ్లెట్ల పోషక విలువను పెంచడానికి కూరగాయలు లేదా లీన్ మాంసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పదార్థాల వల్ల ఉడకబెట్టిన గుడ్లతో పోలిస్తే ఆమ్లెట్‌లు కొంచెం ఎక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటాయి. అయినప్పటికీ, పోషకాహార ప్రొఫైల్ దాదాపుగా అలాగే ఉంటుంది.

ఏది బెస్ట్..?
రెండూ వేర్వేరు కారణాలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లను ‘‘గోల్డ్ స్టాండర్డ్’’ ప్రోటీన్ గా పిలుస్తారు. ఎందుకంటే అవి మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను సరైన మొత్తంలో కలిగి ఉంటాయి. పనీర్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, గుడ్లలో ఉండే కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు లేవు. గుడ్లలో అత్యధికంగా ప్రోటీన్ డైజెస్టిబిలిటీ-కరెక్టెడ్ అమైనో యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి శరీరం గుడ్ల నుండి ప్రోటీన్‌ను ఈజీగా జీర్ణం చేయగలదు. పనీర్‌లో కేసిన్ పుష్కలంగా ఉండడంతో నెమ్మదిగా జీర్ణమవుతుంది. రెండింటిలో గుడ్లు ఉత్తమమైనవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ALSO READ  Mahaa Kumbha Mela: ట్రాఫిక్ లో 15 గంటలుగా అరెస్ట్ అయిపోయిన భక్త జనం.. మహా కుంభమేళా దారులన్నీ జామ్!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *