Salman Khan: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్నారనే వార్తలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘బిగ్‌బాస్ 19’ సీజన్‌లో ఒక ఎపిసోడ్‌లో, సల్మాన్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవల గురించి మాట్లాడేటప్పుడు, సల్మాన్ ఖాన్ ఫర్హానా భట్ అనే కంటెస్టెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఫర్హానా.. మరో కంటెస్టెంట్‌ను ‘పైసా విలువ లేని వ్యక్తి’ అని అనడంపై సల్మాన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందరికంటే ఎక్కువ సమస్యలు సృష్టించేవారే శాంతి బహుమతులను కోరుకుంటున్నారు” అని అన్నారు.
Also Read: Sonu Sood: సోనూసూద్ సేవా దృక్పథం: వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఏం చేశాడో తెలుసా?
ట్రంప్ పేరును సల్మాన్ ఖాన్ నేరుగా ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు ట్రంప్‌ను ఉద్దేశించినవే అని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు. భారత్-పాకిస్తాన్‌తో సహా ఏడు యుద్ధాలను ఆపానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోబెల్ బహుమతిపై ఆశ పెరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ మధ్యవర్తిత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో, వారిద్దరి మధ్య స్నేహ బంధంలో దూరం పెరిగిందని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే, ఇటీవల మోదీ, ట్రంప్‌లు ఎక్స్ (X) వేదికగా స్నేహాన్ని పునరుద్ధరించుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అభిమానులు సల్మాన్ తీసుకున్న స్టాండ్‌ను ప్రశంసిస్తూ, ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలని ఎదురుచూస్తున్నారు.
@realDonaldTrump Ohhh sorry sorry it’s not for you. #Salman indirectly cooked so called #peaceactivist.#BigBoss19 pic.twitter.com/4hnexkprzP
— Prashant Saraswat (@saraswat_pk) September 6, 2025