Horoscope:
మేషం
ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
వృషభం
” స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాదలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు.
మిథునం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు.
కర్కాటకం
బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు.
సింహం
ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు.
కన్య
ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు.
తుల
అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు.
వృశ్చికం
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి.
ధనుస్సు
అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
మకరం
కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభం
విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం
కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు.
గమనిక : రాశిఫలాలు ఆసక్తి కల పాఠకుల సౌకర్యార్ధం అందిస్తున్నాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఇచ్చిన అంశాలపై కచ్చితత్వాన్ని మహాన్యూస్ నిర్ధారించడంలేదు. సంబంధిత విషయాలను ఫాలో అయ్యే ముందు మీ ఆధ్యాత్మిక సలహాదారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని మహాన్యూస్ గట్టిగా సూచిస్తోంది.