Rapo 22: ప్రస్తుతం రామ్ దర్శకుడు మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ శరవేగంగా ఈ చిత్రాన్ని ఏపీలో పలు లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నారు.అయితే హీరో రామ్ మంచి టాలెంట్ కలిగిన నటుడు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ డాన్స్ మూమెంట్స్ చేసే అతి తక్కువమంది హీరోస్ లో రామ్ కూడా ఒకరని తెలిసిందే. అయితే తనలోని మరో టాలెంట్ ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నారట. తాను తాజాగా నటిస్తున్న సినిమా కోసమే తాను ఒక లవ్ సాంగ్ ని రాసినట్టుగా తెలుస్తుంది. దీనితో తాను రాసిన పాట తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
