Suicide: కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరేమోనని ఆందోళనతో ఆ ఇద్దరూ తనువులు చాలించారు. క్షణికావేశంతో చావే శరణ్యమని భావించారు. స్నేహితుడి గదిలో ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారిద్దరి కుటుంబాల్లో విషాదం నింపారు. పెంచి పెద్ద చేసిన ఆ రెండు కుటుంబాలకు గుండెకోతను మిగిల్చారు.
Suicide: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్‌కుమార్ (24), అదే మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన అలేఖ్య (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెద్దు తమ పెళ్లికి ఒప్పుకోరనే భయం పట్టుకున్నది. కనీసం పెద్దలను అడిగే ధైర్యం కూడా చేయలేదని తెలిసింది.
Suicide: తమ స్నేహితుడి గదికి చేరుకున్న ఆ ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో చిట్యాలపల్లి, భూపాలపట్నం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.