Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.మైసూర్ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మైసూర్ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా పాఠాలు నేర్వలేదు. జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలి. ఈ ప్రభుత్వం మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు బలి కావాలి..?” అంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగా, చెన్నై సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్‌ను మైసూర్ – దర్భంగ భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ బోగీలు రెండు దగ్ధమయ్యాయి.
సుమారు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు
https://x.com/RahulGandhi/status/1844944741605031942?t=9XBMQutyoJsCqRaFer6HAg&s=19