Viral Video: స్క్విడ్ గేమ్.. ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న వెబ్ సిరీస్‌లలో ఇదొకటి. దక్షిణ కొరియాకు చెందిన ఈ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీజన్ 1 2021 లో రిలీజ్ అయి ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు.. దీని ఆధారంగా MR. Beast అనే యూట్యూబ్ ఛానల్ లో స్క్విడ్ గేమ్ తరహాలోనే చేసిన గేమ్ షో యూట్యూబ్ లోనే అని రికార్డ్స్ బాధలు కోటింది.
తాజాగా దీని సీక్వెల్ సీజన్ 2 విడుదల కాగా.. ఇది కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. విడుదల అయిన మొదటి వారంలోనే 68 మిలియన్ల వీక్షణలను సాధించింది. ఇది 92 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులు ఈ వెబ్ సిరీస్‌ని చూస్తున్నారు. కాగా, స్క్విడ్‌గేమ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Nayanatara: నయనతార వివాదంలో మరో ట్విస్ట్
Viral Video: స్క్విడ్ గేమ్ ఒకవేళ కొరియాలో కాకుండా ఇండియాలో జరిగేతే అందులో మన యాక్టర్స్ నటిస్తే బాగుంటుంది కదా.. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇంకా చాలా మంది పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే వింతగా ఉంది కదూ! కానీ కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దానిని నిజం చేసింది. ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్‌లోని పాత్రల తరహాలో బాలీవుడ్, టాలీవుడ్‌ల స్టార్ హీరోలు, కమెడియన్‌లను రూపొందించారు. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీడియో రూపంలో రూపొందించారు. “వీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘స్క్విడ్ గేమ్’లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి” అనే క్యాప్షన్‌తో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు వైరల్ చేస్తున్నారు. స్క్విడ్ గేమ్‌లో తమ అభిమాన హీరోలను చూడటం మంచిదే, కానీ. ఓడిపోతే అనే ఆలోచన వచ్చిన వారు మాత్రం విమర్శిస్తున్నారు. మొత్తంమీద, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మీరు కూడా ఈ వీడియో చుడండి..
This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8
— Priyanka Reddy – Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025