Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆద్యనాథ్ బదులిస్తూ.. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు.
ఈ ఏడాది మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 (మహాశివరాత్రి) వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జరగనుంది. ఈ మహా కుంభమేళా, అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక పండుగ. వరుసగా 45 రోజుల పాటు జరగనుంది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ISRO: మళ్ళీ వాయిదా పడిన ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్
Maha Kumbh 2025: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహా కుంభమేళా కోసం ముమ్మరంగా సన్నాహాలు చేసింది. దీనికోసం దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారన్న విషయానికి సంబంధించి విపక్షాల నుంచి ప్రశ్నలు తలెత్తాయి.
ఈ ప్రశ్నలకు బదులిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ. ఈ కుంభమేళా ద్వారా రాష్ట్రం పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. ఆయన ఉత్తరప్రదేశ్‌కు ఆధ్యాత్మిక పర్యాటక హబ్ హోదాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీని ద్వారా రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లక్ష కోట్ల డాలర్లకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.
ఈ కుంభమేళాకు రూ. 5,000 కోట్లు ఖర్చు చేశారు. కోట్లాది ప్రజల ఆదాయం వల్ల ప్రభుత్వానికి ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.