Pushpa2: సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2’ కూడా ఒకటి. డిసెంబర్ 6న రిలీజ్ కి ఈ సినిమా సన్నాహాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ బిజినెస్ విషయంలో నెంబర్ వన్ లో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’తో పోటీపడుతోందట. ఓవర్ ఆల్ గా సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ కంటే కొద్దిగా ఎక్కువ బిజినెస్ జరిగినట్లు వినికిడి. థియేట్రికల్ తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయిన ‘పుష్ప2’ తెలుగు రాష్ట్రాలలో దాదాపు 194 కోట్ల బిజినెస్ జరిగినట్లు భోగట్టా. ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ 224 కోట్లతో టాప్ లో ఉంది. ఇక ఉత్తరాంధ్రాలో, గుంటూరు ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువ బిజినెస్ జరుపుకున్న ‘పుష్ప2’కు మిగిలిన ఏరియాల్లో తక్కువ బిజినెస్ జరిగింది. నైజాం ఏరియాలో మాత్రం రెండింటికీ సమానస్థాయిలో బిజినెస్ జరిగిందట. అయితే ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి బ్రాండ్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంట స్టార్ హీరోల కలయికలో రాగా ‘పుష్ప2’ మాత్రం అల్లుఅర్జున్ బ్రాండ్ ఇమేజ్ తో ఆడియన్స్ ముందుకు రానుండటం విశేషం. తొలి రోజు వసూళ్ళ విషయంలో 200 కోట్లపై కన్నేసిన పుష్పరాజ్ వసూళ్ళ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ ని ఎలా బీట్ చేస్తాడో చూడాలి.
