Rajasaab: డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రభాస్ వింటేజ్ శైలితో కూడిన అద్భుత నటనతో టీజర్ అబ్బురపరిచింది. రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 59 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
Also Read: Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’లో పూజా హెగ్డే షూటింగ్ వర్క్ కంప్లీట్!
Rajasaab: నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైన ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తా చాటనున్నారని అభిమానులు ఉవ్వళ్లూరుతున్నారు.