Minor Lies On Railway Track: ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఎంతో మంది ప్రాణాలతో ఆటలాడుతున్నారు. తక్కువ సమయంలో ఫేమస్ అవ్వాలని కొందరు అతి తొందరపడుతున్నారు. ఓసారి వైరల్ అయిపోతే చాలు అని పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఒడిశాలోని బౌద్ జిల్లాలో 12 ఏళ్ల చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ కావాలనే ఆలోచనతో ఊహించని పని చేశాడు. జూన్ 29న తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌కి వెళ్లాడు. అక్కడ ఏకంగా రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడ. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు ఆ బాలుడి మీదుగా వెళ్లింది. అదృష్టవశాత్తూ అతడికి ఏమి కాలేదు.
ఈ మొత్తం ఘటనను మరో బాలుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోను వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. వీడియో చూసిన రైల్వే అధికారులు తీవ్రంగా స్పందించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలురను గుర్తించి, వారి తల్లిదండ్రులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇలాంటి ఘటనలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది వైరల్ అవ్వాలనే ఆలోచనతో ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇటీవల కూడా ఇదే తరహాలో పలుచోట్ల రైలు పట్టాలపై పడుకొని రీల్స్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
వీటిని చూసిన నెటిజన్లు భయంతో తల పట్టుకుంటున్నారు. “ఈ చిన్నారి గుండె ఎంత గట్టిదో! ఎంత పిచ్చి సాహసం!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, రైల్వే అధికారులు మాత్రం కఠిన హెచ్చరికలు చేస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పుతున్నారు.
రీల్స్ మీద పిచ్చితో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బాలుడు
రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం కోసం చిన్న పిల్లలు ట్రైన్ పట్టాల మధ్యలో పడుకొని వీడియో తీసుకున్నారు.
బాలుడు ట్రైన్ పట్టాల మధ్యలో పడుకుంటే ఇంకో స్నేహితుడు వీడియో తీస్తున్నాడు..
ఒడిశా – బౌద్ జిల్లాలోని పూరునాపానీలో ఈ ఘటన చోటు… pic.twitter.com/uXpj26hFvd
— s5news (@shekhar26778281) July 7, 2025
మొత్తం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే:
రిల్స్ కోసం ప్రాణాలతో ఆటలాడటం పొరపాటు. కొంచెం ఫేమ్ కోసం జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవడం మంచిది కాదు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సోషల్ మీడియా ఫేమ్ వస్తుంది, పోతుంది.. కానీ ప్రాణం ఒక్కటే!
ఇది కూడా చదవండి:
Viral News: నేపాల్‌కు చెందిన ఈ ‘చాయ్ వాలీ’ అందం ముందు.. రంభ, ఊర్వశి కూడా పనికిరారు
Free Bus Effect: ఉచిత బస్సు ఆడవాళ్లకు.. డ్రైవర్లు, కండక్టర్లకు ఫ్రీగా దెబ్బలు!