Pooja Hegde: ‘ఆచార్య’ తర్వాత తెలుగులో పూజా హేగ్డేకి అవకాశాలు లభించలేదు. టాలీవుడ్ ఎందుకో ఈ బుట్టబొమ్మను దూరం పెట్టేసింది. కారణం బాలీవుడ్ పై అమ్మడు దృష్టి పెట్టడమో? ఏమో? తెలియలేదు. పారితోషికం పెంపు కూడా ఓ కారణమనే వారు లేకపోలేదు. టాలీవుడ్ లో ఛాన్స్ దక్కకపోయినా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. గతేడాది ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ సినిమా చేసిన పూజ ప్రస్తుతం షాహిద్ తో ‘దేవా’ అనే సినిమా చేస్తోంది. అది పూర్తి కాకుండానే వరుణ్ ధావన్ తో ఓ మూవీ కమిట్ అయింది. ఇవి కాకుండా కోలీవుడ్ లో పూజను వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. విజయ్ చివరి సినిమాలో పూజ నే హీరోయిన్ గా ఎంపికైంది. దానితో పాటు సూర్య 44లోనూ ఈ కన్నడ కస్తూరినే హీరోయిన్. ఈ రెండు కాకుండా లారెన్స్ తో ‘కాంచన’ సీరీస్ లో హారర్ కామెడీ చిత్రం కమిట్ అయింది. సో ప్రస్తుతం పూజా కిట్టీలో 5 సినిమాలున్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. హిందీ, తమిళ భాషల్లో రాబోతున్న ఈ ‘పాంచ్ పటాకా’తో పూజ మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు.
Vijay Sethupathi: ఇచ్చింది 8 రోజులు… చేసింది 120 రోజులు!?
Vijay Sethupathi: దక్షిణాదిన విజయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ వేరే లెవల్. తన సినిమా వస్తుందంటే బాషాతీతంగా ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. ఆయన చేసిన సినిమాల ప్రభావం అది. విజయ్ సేతుపతి నటించాడంటే ఆ సినిమాలో విషయం ఉంటుందనే భావనకు వచ్చేశారు ఆడియన్స్. అందుకే విజయ్ సేతుపతితో చిన్న పాత్ర అయినా చేయించాలనుకుంటుంటారు దర్శకనిర్మాతలు. మక్కళ్ సెల్వన్ అనిపించుకున్న విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ చిత్రం దక్షిణాది ప్రేక్షకులనే కాదు చైనీస్ వారిని కూడా ఆలరించింది. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి నటించిన ‘విడుదలై2’ 20న రిలీజ్ అయింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ లేకున్నా మంచి టాక్ అయితే వచ్చింది. ఈసినిమా కోసం వెట్రిమారన్ సేతుపతిని 8 రోజుల డేట్స్ అడిగి ఒప్పించాడట. రంగంలోకి దిగాక 120 రోజుల పాటు షూట్ చేశారట. అయితే వెట్రిమారన్ పై నమ్మకంతో అడిగినన్ని రోజుల కాల్షీట్స్ ఇచ్చేశాడట. అందుకేనేమో విజయ్ సేతుపతి కష్టానికి తగ్గ ప్రతిఫలం స్టాండింగ్ ఒవేషన్ రూపంలో లభిస్తోందట. రివల్యూషనరీ పాయింట్ తో పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కికన ఈ సినిమా కమర్షియల్ గానూ విజయాన్నిసాధించి విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూద్దాం…