Pidamarthi Ravi

Pidamarthi Ravi: మార్వాడీ గో బ్యాక్.. మార్వాడీలకు పిడమర్తి రవి వార్నింగ్

Pidamarthi Ravi: తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త వివాదం రేగింది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆదివారం చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపాయి. ఆయన స్పష్టంగా హెచ్చరించారు – “రాష్ట్రంలో ఒక్క కొత్త షాప్ పెట్టినా ఊరుకోము” అని. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు.

రవి ఆరోపణల ప్రకారం, మార్వాడీ వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసి జీఎస్టీ కట్టరని, బిల్లులు ఇవ్వరని, సంపాదించిన డబ్బులు గుజరాత్‌, రాజస్థాన్‌లకు తీసుకుపోతారని మండిపడ్డారు. అంతేకాకుండా, “మార్వాడీల చందాలతోనే బీజేపీ బతుకుతోంది. అందుకే బండి సంజయ్ వారికి మద్దతు ఇస్తున్నారు” అని హాట్ కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర..

ఇప్పటికే ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ‘గో బ్యాక్ మార్వాడీ’ అంటూ నినాదాలు వేగంగా పాప్యులర్ అవుతుండటంతో ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ చెలరేగింది.

ఇదిలా ఉండగా, రవి పిలుపుతో పాటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో స్థానిక వ్యాపార వర్గాలు కూడా ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే అమన్‌గల్ బంద్ రాష్ట్రవ్యాప్తంగా మరింత సెన్సేషన్ సృష్టించే అవకాశముంది.

రాజకీయంగా, సామాజికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న ఈ ఉద్యమం నిజంగా ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi sanjay: సీఎం రేవంత్ పగటి కలలు మానుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *