Fasting : ఏదో ఒక రోజును ఫాస్టింగ్ డేగా పెట్టుకుంటాం. అయితే కొంతమంది ప్రసాదం తింటారా అంటూ దగ్గరకు వచ్చి మరీ పెడుతుంటారు. అప్పుడేం చేయాలి? తినాలా.. తినకూడదా? ఈ డౌట్ అందరికీ ఉంటుంది. నాకు కూడా ఉంది. తింటే ఫాస్టింగ్‌ను బ్రేక్ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నారా?
హా.. కరెక్టే. కానీ, తినడం వల్ల తప్పేం లేదంటోంది ధర్మశాస్త్రం. ప్రసాదమనేది పవిత్రమైనది. దాన్ని ఇస్తే తిరస్కరించకూడదు. అందులోనూ ప్రసాదం అనేది కొద్దిగానే ఉంటుంది కాబట్టి.. ఏ డౌట్ లేకుండా తినొచ్చు అంటున్నారు ప్రవచనకర్తలు. దానివల్ల ఎలాంటి దోషం ఉండదని అంటున్నారు.
అలా కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది. చేతిలో పడిన ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని, కాస్తంత వాసన చూసి మొక్కల వద్ద కానీ, పారే నీటిలో కానీ వదిలేయొచ్చట. అలాగే పక్కన ఉన్నవారికి ఇచ్చినా ఫర్వాలేదట. ఇలా చేయడం వల్ల జీవకోటికి ఆహారాన్ని అందించిన ఫలం దక్కుతుందని చెబుతున్నారు. ప్రసాదాన్ని పక్కన పెట్టామనే బాధ కూడా తప్పుతుందని అంటున్నరు.