Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ “ఆపరేషన్ సింధూర్” కార్యక్రమం నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక బలం కల్పించాలనే ఉద్దేశంతో పవన్ ఈ సూచనలు చేశారు.
వచ్చే మంగళవారం రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ షణ్ముఖ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిందిగా పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రతి క్షేత్రంలో స్థానిక MLAలతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.
కర్నాటకలోని శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలు వంటి క్షేత్రాల్లో పూజలు నిర్వహించాల్సిందిగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రి, పిఠాపురం, అరసవల్లి వంటి పవిత్ర క్షేత్రాల్లో కూడా పూజలు చేయాలని ఆయన ఆదేశించారు.
ఇది మాత్రమే కాకుండా, పవన్ కల్యాణ్ మతసామరస్యానికి పెద్దపీట వేస్తూ చర్చిలు, మసీదుల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి అన్ని మతాల మద్దతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ ఆధ్యాత్మిక ఆహ్వానం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.