Health Tips: రోజును సరిగ్గా ప్రారంభించడం వల్ల అంతా సాఫీగా సాగిపోతుంది. శరీరానికి ఉదయం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయమే మన బాడీలో ఎన్నో జీవక్రియలు జరుగుతాయి. అందువల్ల, శరీరాన్ని రిఫ్రెష్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మార్నింగ్ డైరీలో కొన్ని అలవాట్లను చేర్చడం వలన మీ శక్తిని మరింత పెంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియకూడా మెరుగుపడుతుంది. అయితే మీ శరీరాన్ని రీసెట్ చేయడానికి, మీ బాడీ నుండి టాక్సిక్ పదార్థాలను బయటకు పంపడానికి ఉదయం 9 గంటలకు ముందు కొన్ని కీలక పనులు చేయాల్సి ఉంటుంది.
కాలేయ పనితీరు: శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కాలేయంది ప్రధాన పాత్ర. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. విష పదార్థాలను నీటిలో కరిగేలాగా మారుస్తుంది. అవి మూత్రం లేదా మలం ద్వారా బయటకు వస్తాయి.
మూత్రపిండాలు: మూత్రపిండాలు వ్యర్థాలు, అదనపు ద్రవాన్ని తొలగించడానికి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. మూత్రం ద్వారా వాటిని బయటకు పంపిస్తుంది. సరైన మూత్రపిండాల పనితీరుకు నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా కీలకం.
గట్స్, మైక్రోబ్స్: స్టూల్ ద్వారా వ్యర్థాలను తొలగిస్తుంది. హానికరమైన పదార్థాలను తటస్థీకరించడంలో గట్ సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పేగు ద్వారా వ్యర్థాలను తరలించడంతోమ పాటు సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుకోవడంలో ఫైబర్ కీ రోల్ పోషిస్తుంది.
శోషరస వ్యవస్థ: ఈ వ్యవస్థ కణాల నుండి వ్యర్థాలను సేకరించి రక్తానికి రవాణా చేస్తుంది. శోషరస వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి వ్యాయామం చాలా ముఖ్యం.
ఊపిరితిత్తులు, చర్మం: ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ ను విసర్జిస్తాయి. అదే సమయంలో చర్మం చెమట ద్వారా టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.
Health Tips: రాత్రి సమయంలో కాలేయం శరీరం నుండి వ్యర్థాలను చురుకుగా తొలగిస్తుంది. కార్టిసాల్ స్థాయిలు, రసాయన ప్రతిచర్యలు ఉదయం ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా డిటాక్స్ కార్యకలాపాలకు తగినంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
సహజ డిటాక్స్ కోసం బాడీని ఎలా సిద్ధం చేయాలి?
నీరు తాగాలి: గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని ఉదయం నిద్రలేచిన వెంటనే త్రాగాలి. నిమ్మకాయ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. నీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల రాత్రిపూట పేరుకుపోయిన టాక్సిన్స్ ఈజీగా బయటకు వెళ్తాయి.
యోగా లేదా ధ్యానం: ఒత్తిడిని తగ్గించడానికి, ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఐదు నుండి పది నిమిషాల పాటు శ్వాస వ్యాయామాలు, యోగా లేదా ధ్యానం చేయండి. శరీరానికి సరైన ఆక్సిజన్ కణాలను అందించడంతో పాటు కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
వ్యాయామం: వ్యాయామం లేదా యోగా శోషరస వ్యవస్థను సరి చేస్తుంది. ఇది శరీరం యొక్క డిటాక్సినేషన్ విధులకు కీలకమైనది. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చెమట ద్వారా హానికరమైన పదార్ధాలు బయటకు వెళ్లేలా చేస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం
మీ అల్పాహారంలో ఓట్ మీల్, చియా గింజలు, పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం బెటర్. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మలం ద్వారా వ్యర్థాలు తొలగిపోతాయి. ఫైబర్-రిచ్ ఫుడ్స్‌లోని ప్రీబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్‌ను పోషిస్తాయి.
సూర్యరశ్మి: మీ శరీరం యొక్క జీవ గడియారాన్ని నియంత్రించడానికి ఉదయాన్నే సూర్యరశ్మి చాలా అవసరం. ఉదయాన్నే సూర్యరశ్మి పొందడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతోంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కాలేయానికి అవసరమైన పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.