Parvesh Varma: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి ఫలితాలు ఇంకా తేలకున్నా, బీజేపీదే అధికారమని తేలిపోయింది. తాజా సమాచారం మేరకు మొత్తం 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉండగా, ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 36 సీట్లకు మించి తొలి నుంచి ఆధిక్యతలోనే బీజేపీ ఉంటూ వస్తున్నది. దీంతో అధికారం కమలానికేనని నిర్ధారణ అయింది.
Parvesh Varma: ఈ దశలో ముఖ్యమంత్రి ఎవరనే విషయమై ఢిల్లీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఒకటే చర్చ కొనసాగుతున్నది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సంచలన విజయం కైవసం చేసుకున్నారు. తొలి నుంచి ప్రచారంలోనూ దూసుకుపోతూ కేజ్రీవాల్‌కు ముచ్చెమటలు పట్టించారు. పర్వేష్ వర్మ దూకుడుతో రాష్ట్రమంతా తిరగాల్సిన కేజ్రీవాల్ ఒక్క స్థానంలో ప్రచారానికే పరిమితమయ్యారు.
Parvesh Varma: న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఆయనే ముందున్నారని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అధిష్టానం కూడా ప్రతిష్టాత్మక స్థానంలో కేజ్రీవాల్‌పై గెలిస్తే సీఎం సీటును కట్టబెట్టాలని నిర్ణయించుకున్నదని ప్రచారం జరుగుతున్నది.
Parvesh Varma: గెలిచిన వెంటనే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఫలితాల అనంతర పరిణామాలపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతల ఓటమికి పర్వేష్ వర్మ కృషిని ఈ సందర్భంగా అమిత్‌షా అభినందించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ కుమారుడిగా పర్వేష్ వర్మకు గుర్తింపు కూడా ఉన్నది. ఇది కూడా సీఎం రేసులో ఉండటానికి దోహదం చేస్తున్నది.