Viral Video

Viral Video: ఈ కోతి డీల్ మామూలుగా లేదు.. నెటిజన్లు షాక్!

Viral Video: సోషల్ మీడియాలో ఓ కోతి చేసిన పని తెగ వైరల్ అవుతోంది. మనుషుల బలహీనతలను అర్థం చేసుకున్నట్టుగా కనిపించే ఈ కోతి ఓ పర్యాటకుడిని అందరి ముందే బురిడీ కొట్టించింది.

ఒక వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌తో ఎంజాయ్ చేస్తుండగా, ఆ కోతి చాకచక్యంగా ఫోన్‌ను లాక్కుంది. ఒక్కసారిగా ఫోన్ పోయిందని తెలిసి ఆ వ్యక్తి గబ్బపడి దాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నించాడు. కానీ కోతి మాత్రం ఫోన్‌ను భద్రంగా పట్టుకుని భవనంపైకి ఎక్కేసింది. ఎంత ప్రాధేయపడినా, ఎంత ప్రయత్నించినా ఫోన్ ఇవ్వకుండా భీష్మించుకుంది.

Also Read: Jeera Water Benefits: రోజుకు ఇంత జీలకర్ర నీరు తాగితే ఆ సమస్యలన్నీ దూరం..

అప్పటికే పరిస్థితి అర్థం చేసుకున్న ఆ వ్యక్తి, కోతికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకెళ్లి చూపించాడు. ఫ్రూటీ ప్యాకెట్‌ను చూపించగానే కోతి ఆసక్తిగా చూశింది. మొదటి ప్రయత్నంలో ఫ్రూటీ అందుకోలేకపోయినా, రెండోసారి కచ్చితంగా అందుకుంది. వెంటనే, ‘‘ఇదిగో నీ ఫోన్, నాకు కావాల్సిందొచ్చింది, ఇక చెక్కేస్తా!’’ అన్నట్టుగా ఫోన్‌ను కింద పడేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ కోతి పెద్ద డీల్ మేకరే, వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలుసు!’’ అంటుంటే, మరికొందరు ‘‘ఇది ఓ ముఠా కోతి, డేంజర్’’ అంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో లక్షల సంఖ్యలో లైక్‌లు, కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jeevandan: చనిపోతూ ఆరుగురి ప్రాణాల‌కు ఆయువు పోసిన యువ‌కుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *