T20 Cricket

T20 Cricket: టీ20ల్లో ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు.. 7 పరుగులకే ఆలౌట్ అయిన టీమ్

T20 Cricket: టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఐవరీకోస్ట్ జట్టు కేవలం 7 పరుగులకే ఆలౌటైంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. లాగోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య నైజీరియా, ఐవరీకోస్ట్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నైజీరియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో  ఇన్నింగ్స్ ప్రారంభించిన నైజీరియా జట్టుకు సెలిమ్ సలావ్, సులైమాన్ అత్యుత్తమ ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సులైమాన్ (50) వికెట్‌ను అవుట్ బ్లాస్టింగ్ బ్యాటింగ్ కొనసాగించిన సెలిమ్ సలావ్ 53 బంతుల్లో 2 సిక్సర్లు, 13 ఫోర్లతో 112 పరుగులతో సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఇసాక్ ఓక్పే 23 బంతుల్లో 6 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. దీంతో నైజీరియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

272 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన  ఐవరీకోస్ట్ జట్టు బ్యాట్స్‌మెన్ వచ్చినంత వేగంగా వెనుదిరిగారు. ఓపెనర్ కోనా అజీజ్ వికెట్ తో మొదలైన పెవిలియన్ పరేడ్ పుంబా దిమిత్రి వికెట్ తో ముగిసింది. ఈ మధ్యలో  ఐవరీకోస్ట్ జట్టులోని 7 మంది బ్యాటర్లు జీరో స్కోరు చేశారు.

ఫలితంగా ఐవరీకోస్ట్ జట్టు 7.3 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటైంది. దీంతో నైజీరియా జట్టు 264 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గొప్ప విజయంతో నైజీరియా టీ20 క్రికెట్ చరిత్రలో భారీ పరుగుల తేడాతో గెలిచిన రికార్డు జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది.

ఇది కూడా చదవండి: IPL 2025: అప్పుడేమో రూ.20 లక్షలు.. కట్ చేస్తే! ఇప్పుడు ఏకంగా 4.8 కోట్లు

చెత్త రికార్డు..

T20 Cricket: ఐవరీకోస్ట్ జట్టు కేవలం 7 పరుగులకే ఆలౌట్ కావడం ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఇంతకు ముందు, ఈ భయంకరమైన రికార్డు మంగోలియన్ జట్టు పేరిట ఉంది.

సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా కేవలం 10 పరుగులకే ఆలౌటై ఈ అనవసర రికార్డు సృష్టించింది. ఇప్పుడు కేవలం 7 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముగించడం ద్వారా, ఈ పేలవమైన రికార్డు జాబితాలో ఐవరీ కోస్ట్ మొదటి స్థానంలో నిలిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hockey India Legue: మళ్ళీ ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్.. ఎప్పటి నుంచి అంటే.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *