Crime News: సోషల్ మీడియా నే ప్రపంచంగా బతుకుతున్న జనాలు పెరుగుతున్న కొద్దీ సమాజంలో అక్రమ సంబంధాలు, లేదా సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టుల వాళ్ళ.. హత్యలు పెరుగుతున్నాయి. ఇపుడు ఇది అంత ఎందుకు అనుకుంటున్నారా.. ఏడాది క్రితం ఇంస్టాగ్రామ్ లో జరిగిన గొడవ కారణంగా బాసిత్(20) అనే యువకుడిని కిరాతకంగా చంపేసిన దుండగులు.
బాసిత్(20) అనే యువకుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వ్వక్తి. అతడిని ఈ నెల 3వ తేదీ నుండి కనిపికుండా పోయాడు. తర్వాత ఆది కిడ్నప్ అని తెలిసింది.. బాసిత్ తల్లి సబియా తన కొడుకుని భూపాలపల్లి పట్టణానికి చెందిన బబ్లు, ప్రశాంత్, కుశల్ అనే ముగ్గురు వ్యక్తులు కొట్టి ఆటో లో కిడ్నప్ చేశారు అని పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. దింతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు, వెంటనే కంప్లైంట్ ఆధారంగా కేసు ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ముందుగా కంప్లైంట్ లో ఉన్న ముగ్గురుని అరెస్ట్ చేసి విచారించగా.. తామే బాసిత్ ని హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో కిడ్నాప్ అయ్యాడు అనుకున్న కొడుకు హత్యకు గురికావడంతో కన్నీరు మున్నీరు అయిన కుటుంబ సభ్యులు
ఇది కూడా చదవండి: Red Fort: ఎర్రకోటలో భారీ చోరీ.. వజ్రాలతో పొదిగిన కలశం అపహరణ
బాసిత్ ని తాళ్లతో చేతులు వెనక్కి కాటేసి అతడిని కారులో కిడ్నప్ చేసి.. వెళ్లే దారిలో విచక్షణ రహితంగా కొట్టారు. అతడిని మేడారం అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవదాహనం చేశారు. దుండగులు చెప్పిన విషయం తో కంగు తిన్న పోలీసులు. వాళ్ళు చెప్పిన ప్లేస్ లో చూడగా అక్కడే బాసిత్ డెడ్ బాడీ ఉంది. వెంటనే పోస్టుమార్టం కి పంపించారు పోలీసులు. ఈ మర్డర్ చేయడానికి ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురు సాయం చేసినట్టు తెలిపారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. అయితే ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్ లో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నా పోలీసులు.
బాసిత్ అభ్యంతరకరమైన మెసెజ్‌లు పెట్టిన నేపధ్యంలో గొడవలు జరిగినట్లుగా సమాచారం. దింతో తనకి ప్రాణహాని ఉంది అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటు మృతుడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టే లోపే ఆ ముఠా అతని కిడ్నప్ చేసి హత్య చేసి కసి తీర్చుకున్నారు.ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది అని సమాచారం దొరకగానే అని విషయాలు బయటికి వెల్లడిస్తాం అని తెలిపారు పోలీసులు.