Hyderabad: హైదరాబాద్ నగరంలో కొందరు వాహన డ్రైవర్ల వేగానికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఏదో ఒక చోట తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రోజూ కొందరు ప్రాణాలిడుస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ చర్యలు ఎన్ని చేపడుతున్నా, కొందరు అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. ఇదే విధంగా సోమవారం ఓ లారీ డ్రైవర్ అతి వేగంగా నడపడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది.
Hyderabad: హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఎక్స్ రోడ్డు వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. జంక్షన్ వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాల పైకి ఒక్కసారిగా ఆ లారీ అతి వేగంగా వచ్చి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పోలీస్ వాహనంపైకి కూడా ఆ లారీ దూసుకెళ్లింది. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.