Nikhil Siddharth UNIK: ‘కార్తికేయ2’తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. అయితే ఆ తర్వాత ’18 పేజెస్’ తో సోసో అనిపించినా ఇటీవల రిలీజ్ అయిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ డిజాసర్ట్ కావటం, దానికి ముందు వచ్చిన ‘స్పై’ కూడా అట్టర్ ప్లాఫ్ కావటంతో రాబోయే ‘స్వయంభూ’ పైనే ఆశలు పెట్టుకున్నాడు సిద్ధార్థ్. అంతే కాదు తన పేరుకు ముందు కొత్త గా ట్యాగ్ చేర్చమంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇకపై తనను యూనిక్ స్టార్ అని పిలవాలంటున్నాడు. నిజానికి మన దేశంలో స్టార్స్ కి బిరుదులు, ట్యాగ్ లు తగిలించటం పరిపాటే. ఆ మధ్య శర్వానంద్ చార్మింగ్ స్టార్ అని, రాజ్ తరుణ్ జోవియస్ స్టార్ అని, సుధీర్ బాబు నవ దళపతి అని ట్యాగ్స్ తగిలించేసుకున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం ముందు ఉన్న ట్యాగ్ లను మార్చేసుకుంటున్నారు.
Nikhil Siddharth UNIK: డిసెంబర్ 5న ‘పుష్ప2’తో రాబోతున్న అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా, రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా, జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ట్యాగ్స్ ఛేంజ్ చేశారు. ఐతే ఈ స్టార్స్ భారీ ఫ్యాన్ బేస్ ఉన్నవారు. కాబట్టి వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతూ వస్తోంది. ముందు చెప్పిన శర్వానంద్, రాజ్ తరుణ్, సుధీర్ బాబు ఎవరికీ సాలీడ్ హిట్ లేదు. ఇప్పుడు వరుస ప్లాప్స్ లో ఉన్న నిఖిల్ కి కూడా ఫ్యాన్ బేస్ లేదనే చెప్పాలి. దాంతో సోషల్ మీడియాలో ఈ హీరోలు ట్రోల్స్ కి గురవుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే అర్జెంట్ గా వీరికి హిట్స్ పడాలి. నిఖిల్ కి కూడా రాబోయే సినిమాలు ‘స్వయంభు’, ‘ద ఇండియా హౌస్’ విజయం సాదిస్తే ఓకె. లేకుంటే ‘యూనిక్’ ట్యాగ్ కూడా నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. ఏమంటారు!?
Tag me with thissssss # U N I K⭐️ https://t.co/ptp5dyb89y
— Nikhil Siddhartha (@actor_Nikhil) November 18, 2024