Taapsee: టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్ లో నటిగా గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తూ వస్తోంది తాప్పీ. తాజాగా ఓ ఇంటెన్స్ యాక్షన్ రివెంజ్ డ్రామా సినిమాలో నటించబోతోంది. ‘గాంధారి’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను కనిక థిల్లాన్ నిర్మిస్తున్నారు. కిడ్నాప్ అయిన బిడ్డను వెతికి తీసుకువచ్చే ఓ తల్లి పోరాటమే ఈ చిత్రం అంటున్నారు. గతంలో తాప్సీ ‘బేబి, నామ్ షబానా’ వంటి యాక్షన్ జోనర్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ‘గాంధారి’ తనకు ఓ ఫ్రెష్ ఛాలెంజ్. గతంలో ‘జోరమ్, అజ్జి, భోంస్లే’ చిత్రాల దర్శకుడు దేవాషీస్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాప్సీ, కనిక థిల్లాన్ కలయికలో ఇది ఆరో చిత్రం. గతంలో ‘మన్మార్జియాన్, హీసీన్ దిల్ రూబా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా’, ‘రష్మి రాకెట్’, ‘డుంకీ’ సినిమాలు వీరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు ‘గాంధారి’ ఆరో చిత్రం. ఈ సినిమా కోసం తాప్సీ ఎలాంటి డూప్ లేకుండా నటిస్తుండటం విశేషం. మరి ‘గాంధారి’ తాప్సీకి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
