Newlywed Bride Cheats Man

Newlywed Bride Cheats Man: బీజేపీ నేతను మోసగించిన నవ వధువు.. లక్షల డబ్బుతో పరార్‌

Newlywed Bride Cheats Man: బీజేపీ నేతను నవ వధువు మోసగించింది. అతడిని పెళ్లాడిన ఆమె లక్షల డబ్బుతో పారిపోయింది. ఆ మహిళకు మరో భర్త కూడా ఉన్నట్లు ఆ బీజేపీ నేత ఆరోపించాడు. మాయమైన నవ వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధరమ్‌గంజ్ గ్రామానికి చెందిన బీజేపీ యువమోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి రాకేష్ గుప్తాకు ఇటీవల ఇషికా అనే మహిళతో పెళ్లి జరిగింది. గుడిలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఘనంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. అయితే బెంగాల్‌లోని తన ఊరికి వెళ్లిన నవ వధువు ఆ తర్వాత మాయమైంది.

కాగా, కొత్తగా పెళ్లైన తన భార్య ఇషికాను రాత్రివేళ తన ఇంట్లో అత్తమామలు ఉంచలేదని రాకేష్ గుప్తా ఆరోపించాడు. వారి కోసం ఆ మహిళ పదేపదే డబ్బు అడిగిందని తెలిపాడు. ఒక స్థలం, రూ.30 లక్షలకు పైగా నగదు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ డబ్బుతో ఆమె పారిపోవడానికి అత్తమామలు సహరించారని ఆరోపించాడు. 

ఇది కూడా చదవండి: Mangampet Incident: పోలీసులు పట్టించుకోలేదు అని.. కువైట్ నుంచి వచ్చి చంపేశాడు

Newlywed Bride Cheats Man: తమ కుమార్తెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి పిలిచారని, అక్కడకు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొమ్మిది నెలల కిందట బెంగాల్‌లోని కంకిలో మరో వ్యక్తిని పెళ్లాడిన ఆమె అతడిని కూడా మోసం చేసిందని ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఫొటోను బయటపెట్టాడు.

మరోవైపు రాకేష్ గుప్తా ఆరోపణలను ఇషికా తల్లిదండ్రులు ఖండించారు. వారిద్దరికి పెళ్లి జరుగలేదని తెలిపారు. డిసెంబర్‌ 6న కేవలం నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. అయితే పోలీసులు ఇరు కుటుంబాలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. కాగా, రాకేష్ గుప్తా ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *