Dhanush: కోలీవుడ్ స్టారో ధనుష్ కి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. అక్కడ ఇక్కడ స్ట్రెయిట్ సినిమాలు కూడా చేసి అలరించాడు ధనుష్. అంతేకాదు గతంలో హాలీవుడ్ చిత్రాలలోనూ నటించిన అనుభవం ఉంది ధనుష్ కి. ముందు ‘ది ఎక్స్ ట్రార్డినరీ ఫకీర్’ సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టిన ధనుష్ ఆ తర్వాత ‘గ్రే మ్యాన్’ లో కూడా నటించాడు. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడు. అమెరికన్ నటి సిడ్నీ స్వీనీతో కలసి ‘స్ట్రీట్ ఫైటర్’ అనే మూవీలో నటించనున్నాడు. ఈ స్పోర్ట్స్ బయోపిక్ లో సిడ్సీ స్వీనీ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ క్రిస్టీ మార్టిన్ గా కనిపించనుంది. సోనీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నాగార్జునతో కలసి ఓ సినిమా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఇళయరాజా బయోపిక్ లోనూ నటిస్తున్నాడు.
………………………
UI The Movie: ఉపేంద్ర ‘యు.ఐ.’కు యు/ఎ సర్టిఫికెట్!
UI The Movie: చాలా కాలం గ్యాప్ తర్వాత ఉపేంద్ర మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. గత యేడాది ఆయన నటించి పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో దాని సీక్వెల్ రూపుదిద్దుకోవడం అనుమానమే అంటున్నాయి కన్నడ ట్రేడ్ వర్గాలు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘యు.ఐ.’ను తెరకెక్కించారు. డిసెంబర్ 20న రాబోతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేయబోతోంది. భారీ బడ్జెట్ తో కె.పి. శ్రీకాంత్… జి. మనోహర్ఓ తో కలిసి ఈ మూవీని నిర్మించారు. ఇప్పటి వరకూ విడుదలైన ఈ సినిమా కంటెంట్ తో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డయి. తాజాగా విడుదలైన వార్నర్ వీడియో కూడా నేషనల్ వైడ్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. రీష్మా నానయ్య, మురళీశర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీకృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ కీలక పాత్రలు పోషించారు.
………………………..
Mohan babu: మోహన్ బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు
Mohan babu: సినీనటుడు మోహన్‌బాబు మీద పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబుని నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై దాడి జరిపినందుకు బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, కేసును హత్యాయత్నం కింద మార్చారు.
మంగళవారం, మోహన్‌బాబు, ఆయన బౌన్సర్లు సహాయకులతో కలిసి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఒక ఛానల్ ప్రతినిధి చేతిలో ఉన్న మైక్‌ను లాక్కుని, ఆయన ముఖంపై కొట్టడం జరిగింది. దీనితోపాటు, బౌన్సర్లు మీడియా ప్రతినిధులను కర్రలతో కొట్టారు. ఒక ఛానల్ కెమెరామెన్ కింద పడ్డారు. ఈ ఘటనపై టీయూడబ్ల్యూజే, పలు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేశారు. మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మోహన్‌బాబు మేనేజర్ కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన వినయ్‌రెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది