Health Tips: ఉదయం నిద్రలేచిన వెంటనే అల్పాహారంగా ఏమి తింటారు? చాలా ఇళ్లలో ఇడ్లీ, దోశలు సర్వసాధారణం. కానీ బరువు తగ్గాలి అనుకుంటే ఇడ్లీ లేదా దోశ తినరు. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారని అంటారు. బరువు తగ్గడానికి ప్రోటీన్ ఆహారాలు, ప్రోటీన్ షేక్స్ తీసుకోవాలని నిపుణులు చెప్తారు. కానీ ఇంట్లో తయారుచేసిన దోశ తినడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? మీరు నమ్మకపోయినా అది నిజం. ఇప్పుడు దోశ తినడం ద్వారా బరువు తగ్గడం ఎలాగో చూద్దాం.
దోశ
సాధారణంగా దోశ తయారు చేయడానికి మనం పప్పు, బియ్యం ఉపయోగిస్తాము. ప్రోబయోటిక్ ఆహారం అయిన దోసలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. దోశలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. జీర్ణం కావడం సులభం. కాబట్టి జీర్ణ సమస్యలు ఉండవు. డయాబెటిస్ ఉన్నవారికి మరియు బరువు తగ్గేవారికి ఇది మంచి స్నాక్.
దోశలోని పోషకాలు:
ఒక సాదా దోశకు 40-45 గ్రాముల పిండి అవసరం. ఇందులో 168 కేలరీలు ఉంటాయి. ఇందులో 29 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.7 గ్రాముల కొవ్వు, 4 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము ఫైబర్, 94 మిల్లీగ్రాముల సోడియం, 76 మిల్లీగ్రాముల పొటాషియం సహా ఇతర కొవ్వులు ఉంటాయి. దీనివల్ల విటమిన్లు ఎ, సి, కాల్షియం, ఐరన్ లభిస్తాయి.
దోశతో బరువు తగ్గడం ఎలా?
హోటల్ దోసె తినడం వల్ల బరువు తగ్గలేరు. వాళ్ళు అక్కడ చాలా నెయ్యి, నూనె పోయడంతో కేలరీలు పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోనే చేసుకుని తింటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉదయం దోశ తినడం వల్ల ఆ రోజుకు కావలసిన పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. పిండిని పులియబెట్టడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. దోశలో ఎక్కువ నూనె వేయొద్దు. క్యారెట్, కొత్తిమీర వేసి తినాలి. దోశలోని ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు తక్కువ కేలరీలు తీసుకుంటారు. కాబట్టి బరువు తగ్గుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం బరువు పెరగడానికి కారణం కాదు. దోశ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది. దోశలోని కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి. మెంతుల్లో ఐరన్,కాల్షియం ఉంటాయి. కాల్షియం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ రోజుకు 4-5 దోశలు తినడం వల్ల బరువు తగ్గలేరు. ఒక మీడియం సైజు దోసె తింటే సరిపోతుంది.