Baba Siddique: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసులో శుక్రవారం కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య చేసిన నిందితులకు పలు రివార్డులు ఇస్తామని కుట్రదారులు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన 18 మంది నిందితుల్లో నలుగురు నిందితులకు రూ.25 లక్షల నగదు, కారు, ఫ్లాట్, దుబాయ్ ట్రిప్ ఇస్తానని హామీ ఇచ్చారు.
కుట్రలో పాల్గొన్న రామ్‌ఫూల్‌చంద్ కనోజియా, రూపేష్ మోహోల్, శివమ్ కుహద్, కరణ్ సాల్వే,, గౌరవ్ అపునే లకు రివార్డు ఇస్తామని చెప్పి బాబా సిద్ధిఖీని హతమార్చారు.
అక్టోబర్ 12 రాత్రి, బాబా సిద్ధిఖీని అతని కుమారుడు జీషన్ కార్యాలయం వెలుపల కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ గ్యాంగ్ ఈ హత్యకు బాధ్యత వహించింది. బాబా హత్యకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కారణమని గ్యాంగ్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Tailors: మహిళల దుస్తుల కొలతలు పురుష టైలర్లు తీసుకోవడం కుదరదు
Baba Siddique: హత్య కుట్రలో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను క్రైమ్ బ్రాంచ్ బుధవారం అరెస్టు చేసింది. ఆదిత్య గుల్ంకర్ , రఫీక్ షేక) పూణేలోని కార్వే నగర్ నివాసితులు. ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరచగా, నవంబర్ 13 వరకు పోలీసు కస్టడీకి పంపారు.
నిందితుడు రూపేష్ మోహోల్‌ను విచారించగా వారిద్దరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కోసం ఖడక్వాస్లా దగ్గర గుల్నాకర్‌కు ఆయుధ శిక్షణ ఇచ్చారు. తొలుత మరింత మంది షూటర్లను చేర్చుకునే ఆలోచన చేశారు. అయితే సూత్రధారి షూటర్ల సంఖ్యను కేవలం ముగ్గురికి పరిమితం చేశారని పోలీసులు తెలిపారు. దీంతో నిందితులు మరిన్ని ఆయుధాలను సేకరించారు.