Horoscope: వీరికి దైవదర్శన భాగ్యం.. ఏ రాశివారికి అంటే..

Horoscope: మేషం

నూత‌నకార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.

వృషభం

ప్రయాణాల వ‌ల్ల లాభం చేకూరుతుంది. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాదలు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.శ్రమ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. ధనచింత ఉండదు. శుభకార్య ప్రయ‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు.

మిథునం

ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. మంచి అవకాశాలను కోల్పోతారు.

కర్కాటకం

బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు.

సింహం

నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.

కన్య

మనస్సు చంచలంగా ఉంటుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు.

తుల

వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

వృశ్చికం

స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.

ధనుస్సు

చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. కుటుంబ కలహాలు దూరమవుతాయి.

మకరం

తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది.

కుంభం

నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది.

ALSO READ  Dharmapuri aravind: ఏ జైలు బాగుంటుందో నిర్ణయించుకోవాలి.. కేటీఆర్ పై అరవింద్ సెటైర్

మీనం

ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *