NARA LOKESH: 2019 ఓటమి నా జీవితాన్ని మలుపు తిప్పింది

NARA LOKESH: మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ పర్యటించారు.  డాన్ బాస్కో స్కూల్ లో నిర్వహించిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం వెలుగులు నింపింది. ఈ సందర్భంగా ఆయన మంగళగిరి ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

“ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంతృప్తి ఎంతో గొప్పది”

పట్టాలు అందజేస్తూ లోకేశ్‌ మాట్లాడుతూ, “మీరు నాకు ఇచ్చిన మద్దతు వల్లే నేను ఈ రోజు మీ ముందున్నాను. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే నాకు నిజమైన సంతోషం” అని హర్షం వ్యక్తం చేశారు.

“2019 ఓటమి నా జీవితాన్ని మలుపు తిప్పింది”

“2019లో మంగళగిరిలో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, మీకు నేనేంటో తెలియదు, మీ కష్టాలేంటో నాకు అంతగా అర్థం కాలేదు. ఫలితంగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. కానీ అదే ఓటమి నాకు మార్గదర్శకంగా మారింది. మరింత కృషి చేసి, మళ్లీ మీ మనస్సు గెలవాలని నిశ్చయించుకున్నాను” అని లోకేశ్‌ హృదయపూర్వకంగా తెలిపారు.

“2019 అవమానం… 2024 గర్వం”

“ఆ రోజుల్లో నన్ను గెలిపించుకోలేకపోయాడని నానా విమర్శలు చేశారు. కానీ నేను మళ్లీ మీ ముందు నిలబడ్డాను. ఆ ఓటమి తరువాత నేను ప్రజలను కోరినదేంటంటే – 5,300 ఓట్ల తేడా పక్కన సున్నా పెడితే 53,000 మెజార్టీ కావాలి అని. కానీ మీరు అంతకంటే మించి – **91 వేల ఓట్ల మెజార్టీ** ఇచ్చి నన్ను గెలిపించారు. అది జీవితాంతం మరిచిపోలేను” అంటూ లోకేశ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Banana: అరటిపండును అతిగా తింటే ఇన్ని అనర్థాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *