Nani-Sujith Combo

Nani-Sujith Combo: నాని-సుజిత్ కాంబో: జెట్ స్పీడులో బ్లాక్‌బస్టర్ ప్లాన్?

Nani-Sujith Combo: నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో ఓ సూపర్ హై ఎనర్జీ మూవీ రాబోతోంది! డివివి దానయ్య బ్యానర్‌లో ఈ చిత్రం గత ఏడాదే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ, సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రంలో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు కాస్త ఆలస్యం అవుతోంది. ‘ఓజీ’ పూర్తయ్యాక సుజిత్ నానితో సినిమాను వేగంగా పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. నాని డైనమిక్ ఎనర్జీకి తగ్గట్టుగా సుజిత్ ఓ థ్రిల్లింగ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. ఈ మూవీని ఏడాదిలోపు పూర్తి చేసి రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది.

ప్రస్తుతం నాని తన ఫోకస్ మొత్తం ‘ప్యారడైజ్’ సినిమాపై పెట్టాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అయితే, సుజిత్ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ‘ప్యారడైజ్’ రిలీజ్‌కు ముందే సుజిత్ సినిమా సెట్స్‌పైకి వెళ్తే, ముందుగానే థియేటర్లలో సందడి చేసే ఛాన్స్ ఉంది. నాని సినిమాల ప్లానింగ్ ఎలా సాగుతుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2 కోసం ముంబై-పంజాబ్ తరపున ఆడే 11 మంది వీళ్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *