My South Diva Calendar

My South Diva Calendar: కలర్‌‌ఫుల్‌గా ‘మై సౌత్ దివా క్యాలెండర్ 2025’

My South Diva Calendar: ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘మై సౌత్‌ దివా’ క్యాలెండర్‌ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై అగ్రశ్రేణిలో ఉన్నారు. తాజాగా 2025 క్యాలెండర్ ను 12మంది స్టార్స్ తో శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్ తో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరింప చేశారు. మనోజ్ కుమార్ కటొకర్ తోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరై విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా… మై సౌత్ దివా క్యాలెండర్ ఫౌండర్, ఫోటో గ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ ‘12 మంది హీరోయిన్స్ తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుంద’నే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Siddharth: 'మిస్ యు' వాయిదాతో సిద్ధార్థ్ పై ట్రోలింగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *