Gandhi Thatha Chettu: ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అవార్డులను అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేశారు మేకర్స్. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన ప్రత్యేకంగా అభినందించారు. రామ్‌చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నేహాల్ తదితరులు ఉన్నారు.
