Midhun Reddy: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. అలాగే, మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు రేపు విచారణ జరపనుంది.
ఈ కేసుకు సంబంధించి నేడు ఎసిబీ కోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, వెంకటేష్ నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. వీరంతా ప్రస్తుతంలో రిమాండ్‌లో ఉన్నారు.
ఏసీబీ విచారణలో మొత్తం 10 మంది పైగా నిందితులుగా ఉన్నట్లు సమాచారం. అక్రమాలు, అవినీతి ఆరోపణలపై కేసు నమోదు అయిన అనంతరం కొంతమంది ఇప్పటికే అరెస్టయ్యారు. నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు.