Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు ఓ కీలక సమాచారం. మెట్రో రైలు యాజమాన్యం ఛార్జీలను అధికారికంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టికెట్ రేట్లు 2025 మే 17వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
చార్జీల పెంపు వివరాలు:
కనిష్ట టికెట్ ధర: ప్రస్తుతం ఉన్న ₹10 నుండి ₹12కి పెంపు
గరిష్ట టికెట్ ధర: ₹60 నుండి ₹75కి పెరిగింది
ఈ ఛార్జీల పెంపుతో పాటు, మెట్రో సంస్థ ఆధునికీకరణ, మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్వహణ ఖర్చులను తీర్చేందుకు ఇది అవసరమని అధికారులు చెబుతున్నారు.ప్రజలు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, టికెట్ ధరల మార్పును దృష్టిలో ఉంచుకోవాలని మెట్రో అధికారులు సూచిస్తున్నారు.