Crime News

Crime News: శ్రీకాకుళం జిల్లా న్యూకాలనీలో వివాహిత కళావతి దారుణ హత్య

Crime News: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి వెళ్లి తన వస్త్రాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె..తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. అయితే,న్యూకాలనీ ఎక్సైజ్ కార్యాలయం సమీపంలోని ఓ ఫ్లోర్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది.

ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్‌ ఎంటర్‌ప్రైజన్ బిల్డింగ్ ఒకటో ప్లార్‌కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్‌తో పై ప్లోర్ రూమ్‌లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్‌లో కళావతి విగతజీవిగా పడి ఉంది.

పరిసరాలన్నీ పరిశీలించగా బాత్‌రూమ్‌ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి.. అందులో పైప్లోర్‌లో అండలూరి శరత్‌కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *