Health: సోషల్ మీడియా..ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా మారింది. ఎన్నో జీవితాలను ఇది శాసిస్తుంది. ఖాళీ టైమ్ దొరికితే రీల్స్ చూడడం అందరికి అలవాటుగా మారింది. కొంత మంది అన్నం, నిద్ర మానుకుని మరీ రీల్స్ చూడడంలో మునిగిపోతారు. అయితే ఇలా చేయడం అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది తిని పడుకుని రీళ్లు చూస్తూ కాలం గడిపేస్తుంటారు. నిద్రవేళలో రీల్స్ చూడటం, మొబైల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల యువత, మధ్య వయస్కుల్లో అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. చైనాలోని 4,318 మంది యువకులు, మధ్య వయస్కులపై జరిపిన ఒక అధ్యయనంలో అత్యధిక రీల్స్‌ను చూసే వారు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు.
నిద్రవేళలో రీల్స్ చూసే సమయం ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. స్లీపింగ్ టైమ్ లో మొబైల్ చూడటం వల్ల శరీరానికి రెస్ట్ అనేది ఉండదు. దీని వల్ల నిద్రలేమితో పాటు బీపీ కూడా వస్తుందని నిపుణులు తేల్చారు. నిద్రవేళలో రీల్స్ చూడడం తగ్గించకపోతే అధిక రక్తపోటు రావడం ఖాయమని.. కాబట్టి ఫోన్ పక్కనబెట్టి పడుకోవాలని సూచిస్తున్నారు.