Palnadu: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రేషన్ రవాణా చేస్తూ ప్రమాదవశాత్తు రేషన్ వాహనం తిరగబడి దాచేపల్లికి చెందిన షేక్ నాగూర్ 25 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి… తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దామరచర్లలో లారీ బోల్తా పడిన సంఘటన జరిగింది.. దాచేపల్లి కి చెందిన వ్యక్తి అక్రమ రేషన్ వ్యాపారం చేస్తూ గ్రామం నుండి కూలీలను తీసుకెళ్లి అక్రమ రేషన్ బియ్యం తరలిస్తుండగా లారీ బోల్తా పడి మృతి చెందిన సంఘటన జరిగింది. రాత్రికి రాత్రే ప్రమాదానికి గురైన వాహనాన్ని మృతదేహాన్ని రేషన్ అక్రమ రవాణా దారులు తెలంగాణ నుంచి తీసుకొచ్చి దాచేపల్లి లోని మృతుని ఇంటి వద్ద వదిలి వేళ్ళిన రేషన్ మాఫీయా. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించే లోపే తెలంగాణ పోలీసులు వచ్చి తెలంగాణ పరిధిలో వాహనం బోల్తా పడి షేక్ నాగుర్ చనిపోయారని పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకు వచ్చారని తెలంగాణ పోలీస్లు కంప్లైంట్ రాసుకున్నారు. తమకు న్యాయం జరగాలంటూ మృతుని బంధువులు శవాన్ని దాచేపల్లి వద్ద ఉన్న అద్దంకి నార్కెట్పల్లి హైవే వద్దకు తీసుకువచ్చి ధర్నా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
